top of page

🎬 యూట్యూబ్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.🌐

🚀ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ 📽️ తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే ఇది వినియోగదారులకు కాకుండా క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. వీడియోల కింద వచ్చే కామెంట్స్‌ కోసం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. 🗨️

సాధారణంగా యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేసే క్రియేటర్స్‌ ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో కామెంట్స్‌ ఒకటి. కొన్ని సందర్భాల్లో కామెంట్స్‌తో క్రియేటర్స్‌ ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కంటెంట్‌ విషయంలో కొందరు యూజర్లు అభ్యంతరకర కామెంట్స్‌ చేసే సందర్భాలను చూస్తునే ఉంటాం. 🤔

అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు యూబ్యూట్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్‌తో క్రియేటర్స్‌ తమ వీడియోల క్రింద వచ్చే కామెంట్లను పాజ్ చేయడానికి అవకాశం లభిస్తుంది. ఈ విషయాన్ని యూట్యూబ్‌ తన బ్లాగ్‌లో పోస్ట్ చేసింది. 📝

ఇంతకుముందు యూట్యూబ్‌ వీడియోలకు వచ్చే కామెంట్ల విషయంలో రెండు ఆప్షన్లు మాత్రమే ఉండేవి, మొదటిది కామెంట్లను పూర్తిగా నిలిపివేయడం,రెండోది పబ్లిష్ చేయడం. మధ్యలో కామెంట్లను ఆపడానికి ఎలాంటి ఆప్షన్‌ ఉండేది కాదు. 🔄

కానీ ఇప్పుడు తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో మధ్యలో కామెంట్స్‌ను పాజ్‌ చేసే అవకాశం లభించనుంది. దీంతో అప్పటి వరకు వచ్చిన పాత కామెంట్స్‌ అలాగే ఉంటాయి. కానీ కొత్తవి మాత్రం కనిపించవు. క్రియేటర్స్‌కు తమ వీడియోలపై పూర్తి నియంత్రణను అందించడానికి ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. 🎉

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page