top of page
MediaFx

ఆపిల్‌ నుంచి మరో స్టన్నింగ్ గ్యాడ్జెట్‌..


టెక్‌ దిగ్గజం ఆపిల్.. ఐఫోన్‌ 16ని లాంచ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ఐఫోన్ 16 సిరీస్‌ ఫోన్‌లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇదే సమయంలో మ్యాక్‌ మినీ పేరుతో కంప్యూటర్‌ను కూడా లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అత్యంత చిన్న కంప్యూటర్‌గా దీనిని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ పవర్‌తో పాటు ఎం4 చిప్‌తో ఈ కంప్యూటర్‌ను లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం

ఆపిల్‌ నుంచి అత్యంత బుల్లి డెస్క్‌ కంప్యూటర్‌ ఇదే కానుంది. 2010 నుంచి డిజైన్‌ మార్పుతో వస్తున్న తొలి కంప్యూటర్‌ ఇదే. అక్టోబర్‌ నెల నుంచి మార్కెట్లోకి ఈ కంప్యూటర్‌ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మ్యాక్‌ మినీ కంప్యూటర్‌ ఆపిల్‌ టీవీ స్ట్రీమింగ్ డివైజ్‌ పరిమాణానాన్ని పోలి ఉంటుందని తెలుస్తోంది. ఈ కంప్యూటర్‌ను అల్యూమినియం షెల్‌తో తీసుకురానున్నారు.

కాగా ఈ కంప్యూటర్‌ ధర ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మ్యాక్‌ మినీ కంటే తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం మ్యాక్‌ మినీ ధర 599 డాలర్లుగా ఉంది. ఈ కంప్యూటర్‌తో పాటు ఆపిల్‌ ఈ ఏడాది చివిరి నాటికి ఐమ్యాక్స్, మ్యాక్ బుక్ ప్రోస్‌లను తీసుకొస్తున్నాయని తెలుస్తోంది.

bottom of page