top of page
MediaFx

అనిరుధ్ తెలుగులో మ్యాజిక్ మిస్ అవుతోందా? 🎶

🎤 తమిళంలో ఇప్పుడు అనిరుధ్ రవిచందర్‌ను కొట్టే సంగీత దర్శకుడు లేడు. 17 ఏళ్ల వయసులోనే 3 సినిమాలో "కొలవరి" పాటతో సంచలనం సృష్టించి, ఆ తర్వాత ఎన్నో బ్లాక్‌బస్టర్ ఆడియోలు ఇచ్చాడు. అతడి పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్లకు మన తెలుగువాళ్లు కూడా ఊగిపోతుంటారు. తెలుగులో టాప్ హీరోల సినిమాలకు కూడా అనిరుధ్ పని చేయాలని కోరుకుంటారు. కానీ తెలుగులో అనిరుధ్ ఇప్పటిదాకా పేలిపోయే ఆడియోలు ఇవ్వలేదు. తొలి చిత్రం అజ్ఞాతవాసి నుంచి నిరాశపరుస్తూనే ఉన్నాడు. నానితో చేసిన గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాలకు మంచి మ్యూజిక్కే ఇచ్చినా, తమిళంలో చేసిన సినిమాల రేంజ్ మాత్రం కనిపించలేదు.జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరతో అనిరుధ్ మార్కు ఏంటో చూస్తామని చాలామంది ఆశతో ఉన్నారు. కానీ ఈ సినిమా టీజర్‌లో, ఇటీవలే రిలీజ్ చేసిన "ఫియర్ సాంగ్"లో అనిరుధ్ మ్యాజిక్ అనుకున్న స్థాయిలో కనిపించలేదు. టీజర్ స్కోర్, ఫియర్ పాట బాలేదని అనలేం. కానీ ఆ మ్యూజిక్ ఎక్కడో ఉన్నట్లే అనిపించింది. ముఖ్యంగా ఫియర్ సాంగ్‌ వింటున్నపుడు అతను చేసిన "హుకుమ్" సహా వేరే పాటల ఛాయలు కనిపించాయి. పాటలో మంచి ఊపు ఉన్నా కొత్తదనం కరవైంది. దీనిపై చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఈ పాట రిలీజైన కొన్ని రోజులకే ఇప్పుడు అనిరుధ్ సంగీతం అందించిన తమిళ చిత్రం ఇండియన్-2 నుంచి "సౌరా" అనే పాట రిలీజైంది. ఆ పాట వింటే వేరే లెవెల్ అనిపిస్తోంది. మామూలుగా శంకర్ సినిమాలకు రెహమాన్ అందించే రేంజిలో క్వాలిటీ కనిపించింది. ఈ పాటలో ఉన్న ఒరిజినాలిటీ దేవర పాటలో మిస్ అయిందన్నది స్పష్టం. తెలుగు దర్శకులు అనిరుధ్ నుంచి సరైన ఔట్ పుట్ రాబట్టుకోవడంలో ఫెయిలవుతున్నారని అనుకోవాలి.. లేదా అనిరుధ్ తెలుగు చిత్రాలకు మొక్కుబడిగా పాటలు చేస్తున్నాడని భావించాలి.

bottom of page