top of page
Suresh D

శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. ఈ విషయం తెలుసా, ఆ ఐదు రోజులు!


శ్రీశైలం ఆలయంలో ఉగాదికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉగాది మహోత్సవాలు జరిగే ఆరో తేదీ నుంచి 10వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు భక్తులందరికీ స్వామి వారి అలంకార దర్శనం మాత్రమే జరుగుతుందని ఈవో తెలిపారు. ఉగాది మహోత్సవాల సందర్భంగా సేవలు అందించే స్వచ్చంద సేవకులకు లాటరీ పద్దతిలో సేవా ప్రదేశాలు కేటాయించారు. గతంలో మాదిరిగానే పారదర్శకత కోసం స్వచ్చంద సేవా బృందాల ప్రతినిధుల సమక్షంలో లాటరీ తీశారు. శ్రీశైలం దేవస్థానంలో ఉగాది మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర పాదయాత్ర భక్తబృందాలతో ఆలయ ఈవో పెద్దిరాజు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఏప్రిల్‌ 6 నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలను దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఈ క్రమంలో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలకు చెందిన పాదయాత్ర భక్త బృందాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై చర్చించారు.

bottom of page