top of page

🚀 మనిషి కంటే ముందే అంతరిక్షానికి వెళ్లిన జంతువులు! 🌌

🌠 అంతరిక్ష రంగంలో నూతన విజయాలు సాధించినప్పుడల్లా మనం శాస్త్రవేత్తల కృషిని మెచ్చుకుంటాం. 🧪🔭 అయితే పలు జంతువులు కూడా ఈ విజయంలో భాగస్వామ్యమయ్యాయనే సంగతిని మరచిపోతుంటాం. 🌟

మనుషులు అంతరిక్షంలోకి వెళ్లకముందు వివిధ రకాల జంతువులను అక్కడికి పంపించారు. 🚀💫 ఆ తర్వాతే మనుషులను అక్కడికి సురక్షితంగా పంపించవచ్చని శాస్త్రవేత్తలు గ్రహించారు. 🌐🚀 అంతరిక్షంలోకి పంపబడిన జంతువులలో కోతుల జాతులు ఉన్నాయి. 🦝🚀 వీటిలో రీసస్ మకాక్స్, పిగ్-టెయిల్డ్ కోతులు, స్క్విరెల్-టెయిల్డ్ కోతులు, చింపాంజీలు కూడా ఉన్నాయి. 🐒🚀 ఆల్బర్ట్- II అనే పేరుగల రీసస్ మకాక్ 1949లో 134 కిలోమీటర్ల వరకూ చేరుకుంది. 🐵🚀 అయితే అది తిరిగి వస్తుండగా మృతి చెందింది. ⚠️🚀 దీని తరువాత 1961 లో కోతి జాతికి చెందిన హామ్ అనే చింపాంజీని నాసా అంతరిక్షంలోకి పంపింది, అది సురక్షితంగా తిరిగి వచ్చింది. 🐾🚀 మానవులపై అంతరిక్ష వాతావరణం ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఎలుకలను అంతరిక్షంలోకి పంపారు. 🌎🚀 1950లో 137 కిలోమీటర్ల వరకు అంతరిక్షంలోకి తొలి ఎలుకను పంపారు. 🐕🚀 అయితే అది పారాచూట్ ఫెయిల్యూర్‌తో మృతి చెందింది. ❌🚀 సోవియట్ యూనియన్ అధిక సంఖ్యలో కుక్కలను అంతరిక్షంలోకి పంపారు. 🐶🚀 వాటిలో అత్యంత ప్రసిద్ధమైంది 1957లో లైకా అనే శునకం. 🚀🛰️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page