top of page

'యానిమల్' నుండి విలన్ లుక్ విడుదల చేశారు మేకర్స్..

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్, స్టార్ రణబీర్ కపూర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'యానిమల్' . ఇప్పటికే ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఓకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో దర్శకుడిగా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు సందీప్ వంగ.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసాయి. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ సరికొత్త పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు.ఇప్పటికే అనిల్ కపూర్, రష్మికల పోస్టర్స్ విడుదల చేసిన సందీప్, లేటెస్ట్ గా 'యానిమల్' విలన్ బాబీ డియోల్ పోస్టర్ ని విడుదల చేశాడు. 'యానిమల్ కా విలన్' అనే క్యాప్షన్ తో పోస్టర్ విడుదల చేయగా, ఈ పోస్టర్లో బాబి డియల్ బ్లడ్ షేడ్ లో మోస్ట్ వైలెంట్ మెన్ గా కనిపిస్తున్నాడు. 'యానిమల్' కి విలన్ అంటే 'యానిమల్' కన్నా భయంకరంగా ఉండాలనుకున్నాడో తెలియదు కానీ మునుపెన్నడూ కనిపించని విధంగా ఈ పోస్టర్లో బాబీ డియోల్ చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. పోస్టర్ని బట్టి సినిమాలో రణబీర్ - బాబీ డియోల్ మధ్య బీకర పోరు ఉండబోతున్నట్లు స్పష్టమవుతుంది. ప్రస్తుతం నెట్టింట ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతుంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page