top of page
Shiva YT

🎬🍿 ఓటీటీలో స్ట్రీమింగ్‏కు వచ్చేసిన ‘యానిమల్’.. ఎక్కడ చూడొచ్చంటే..🎥📺

🗓️ ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని ఎదురుచూశారు. ఇక ఎట్టకేలకు జనవరి 26న అర్దరాత్రి నుంచి యానిమల్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ విషయంలో మాత్రం కొందరు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఓటీటీ వెర్షన్ ను కాస్త పొడగించి విడుదల చేస్తామని గతంలో అన్నారు సందీప్ రెడ్డి. దాదాపు 8 నిమిషాల సీన్స్ యాడ్ చేస్తామని అన్నారు. దీంతో యానిమల్ ఓటీటీ వెర్షన్ పై మరింత క్యూరియాసిటీ నెలకొంది.

🎥🍿 కానీ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్న సినిమా మొత్తం థియేట్రికల్ వెర్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది నెటిజన్స్.. ఓటీటీ వెర్షన్లో అన్ సీన్ ఫుటేజ్ చూపిస్తారని భావించారు. థియేట్రికల్ రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాలు ఉండగా.. ఓటీటీలో 3 గంటల 24 నిమిషాలు ఉంది. కేవలం మూడు సీన్స్ యాడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది బీటౌన్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. ఈ సినిమాకు మ్యూజిక్ మరింత హైలెట్. 🎶🎭


bottom of page