యుద్ధాలు చేస్తూ వేటాడే సమాజంలో జీవించడం లేదు. నటన ఎంత బాగా ఉన్నా సరే కుటుంబ బంధాలను ఇలా మితిమీరిన హింసతో చూపించడం తగదు.
ఇలాంటి హింసను ప్రేరేపించే సినిమాల్ని ఆదరిస్తూ ప్రశంసలు కురిపించడం మంచిదికాదు. లక్షలాది మంది సామాన్యులు సినిమాలు చూస్తుంటారు. ఎంటర్ టైన్మెంట్‌ఇండస్ట్రీకి ఒక సామాజిక బాధ్యత ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. యానిమల్ సినిమా చూసి నా మూడు గంటల సమయం వేస్ట్ చేసుకున్నందుకు బాధగా ఉంది’ ఇన్ స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు జయదేవ్ ఉనాద్కత్. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. మరి దీనిపై యానిమల్ మూవీ టీమ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. 🍿