సుమారు 42 రోజులుగా చేస్తున్న అంగన్ వాడీల సమ్మెకు తెరపడింది. 📆 ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. 🎉 అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ. 🤝
సుమారు 42 రోజులుగా చేస్తున్న అంగన్ వాడీల సమ్మెకు తెరపడింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ. వారు చేసిన డిమాండ్లన్ని నెరవేర్చడానికి సానుకూలంగా స్పందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో అంగన్వాడీల సమ్మె కొలిక్కి వచ్చింది. అంగన్వాడీ యూనియన్ నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల మరోసారి జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో ఎట్టకేలకు సమ్మెను విరమించారు అంగన్వాడీలు. నేటి నుంచి విధుల్లో చేరనున్నారు అంగన్వాడీలు. తమ డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు అంగన్వాడీలు.
అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశామన్నారు మంత్రి బొత్స. జీతాల పెంపు కూడా జూలైలో పెంచుతామని హామీ ఇచ్చారు. రిటైర్డ్ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని 50 వేల నుంచి లక్షా 20 వేల రూపాయలకు పెంచామన్నారు. హెల్పర్ కు 60 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సమ్మె కాలానికి జీతాలు ఇవ్వడంతో పాటు… సమ్మె టైంలో పెట్టిన కేసులను ఎత్తేస్తామని స్పష్టం చేశారు. గ్రాట్యువిటీకి సంబంధించి కేంద్రం నిబంధనలను పాటించడంతో పాటు.. ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతున్నట్లు చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ.
ప్రభుత్వం జరిపిన చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని చెప్పారు ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ. తమ డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించి విధులకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఎట్టకేలకు అంగన్‌వాడీల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 42రోజులుగా ఆగిపోయిన అంగన్‌వాడీ సర్వీసులు ఇవాళ్టినుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.