top of page

🔄 రాంచీ పొలిటికల్‌ డ్రామాలో కొత్త ట్విస్ట్‌.. హైదరాబాద్‌కు చేరనున్న రాజకీయం..

🛫రాంచీలో పొలిటికల్‌ డ్రామాలో కొత్త ట్విస్ట్‌ ఇది. రాంచీ నుంచి హైదరాబాద్‌కు క్యాంప్‌ రాజకీయం మారుతుంది. గురువారం సాయంత్రం బేగంపేట ఎయిర్‌పోర్టుకు మహాకూటమి ఎమ్మెల్యేలు చేరుకుంటారు. ఎమ్మెల్యేల కోసం హైదరాబాద్‌ నుంచి రాంచీకి ప్రత్యేక విమానం బయలుదేరింది. 🕵️‍♂️

మనీలాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించేందుకు ధర్మాసనం అంగీకరించింది. సోరెన్‌ తరఫు సీనియర్‌ లాయర్లు జార్ఖండ్‌ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. హేమంత్ సోరెన్ రూ.600 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారనీ, విదేశాలకు డబ్బును అక్రమంగా తరలించారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో ఆయన్ని ప్రశ్నించేందుకు 7సార్లు సమన్లు పంపినా, ఒక్కసారి కూడా హేమంత్ ఈడీ ముందుకు రాలేదు. దాంతో వారే వచ్చి ప్రశ్నించారు. సోరెన్‌ను దాదాపు ఎనిమిది గంటలపాటు విచారించిన ఈడీ ఆయనను అరెస్ట్‌ చేసింది. సోరెన్ అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో బంద్ పాటిస్తున్నాయి గిరిజన సంఘాలు. అయితే ఈడీ అరెస్టు ముందు జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ వీడియో సందేశం రికార్డు చేశారు. తాను ఓటమిని అంగీకరించబోమని.. ఇది కేవలం విరామం మాత్రమేనన్నారు. జీవితం ఒక గొప్ప యుద్ధమని, ప్రతిక్షణం తానూ పోరాడటానికే సిద్ధపడతానన్నారు సోరెన్‌. కానీ ఎప్పటికీ రాజీపడబోనన్నారు.తనపై వచ్చిన ఆరోపణలో ఎంతమాత్రం సోరెన్‌ తేల్చి చెప్పారు. 🚨💼

bottom of page