top of page

పోకో-ఎయిర్‌టెల్ కాంబోలో కొత్త ఫోన్ మామూలుగా లేదుగా..📱🤔

ఈ స్మార్ట్ ఫోన్ లో మీడియా టెక్ హీలియో జీ36 చిప్ సెట్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. 4జీబీ ర్యామ్, 3జీబీ వర్చువల్ గా పెంచుకోవచ్చు.

అంటే మొత్తంగా 7జీబీ ర్యామ్ అందుబాటులో ఉంటుంది. 6.52 అంగుళాల డిస్ ప్లేతో ఇది వస్తుంది. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ జియోమీకి సబ్ బ్రాండ్ అయిన పోకో మరో కొత్త 4జీ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసింది. చవకైన ధరలోనే.. ప్రముఖ టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్ టెల్ తో కలసి విడుదల చేసింది. ఈ ఫోన్ పేరు పోకో సీ51. ఇది ఎయిర్ టెల్ కనెక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ ని వినియోగదారులు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో జూలై 18 నుంచి అమ్మకానికి రానుంది. దీని ధర కేలం రూ. 5,999గా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం.. 📲💰

ఎయిర్ టెల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్.. 💥✨ ఎవరైతే ఎయిర్ టెల్ వినియోగదారులు ఈ ఫోన్ కొనుగోలు చేస్తారో వారికి 50జీబీ డేటా ఎయిర్ టెల్ డేటా ఉచితంగా లభిస్తుంది. ఒకవేళ మీరు నాన్ ఎయిర్ టెల్ వినియోగదారులైనా ఈ ఆఫర్ పొందొచ్చు. అదెలా అంటే ఫోన్ డెలివరీ అప్పుడు సిమ్ కూడా మీకు వస్తుంది. దానిని ఇన్ స్టంట్ యాక్టివేషన్ చేసుకొని ఈ ఫీచర్ పొందొచ్చు. 💥📦


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page