బుధవారం ఉదయం 7:30 సమయం..! విశాఖలోని బేతని స్కూలు విద్యార్థులను ఎక్కించుకుని వారి ఇళ్ళ నుంచి బయలుదేరాడు ఆటో డ్రైవర్.
మరో ఐదు నిమిషాల్లో స్కూలుకు చేరుకుంటారు. ఉదయం 7.25 గంటలకు సంఘం జంక్షన్..! డైమండ్ పార్క్ వైపు నుంచి వెళ్తున్న ఆటో.. అంబేద్కర్ విగ్రహం వైపు వెళ్లేందుకు సంఘం శరత్ జంక్షన్ దగ్గర రోడ్డు క్రాస్ చేస్తోంది. అప్పటికే రైల్వే స్టేషన్ వైపు నుంచి ఆసిలు మెట్ట వైపు ఓ లారీ జంక్షన్ క్రాస్ చేస్తూ మధ్య వరకు వచ్చేసింది. హై స్పీడ్ గా స్కూలు పిల్లలతో వెళ్తున్న ఆటో.. లారీ ముందు భాగం ఎడమవైపు బలంగా ఢీకొట్టింది. నిర్లక్ష్యంతో ఆటోను డ్రైవర్ కంట్రోల్ చేయలేక జంక్షన్ దాటుతున్న లారీను అతివేగంతో వెళ్లి ఢీకొట్టాడు. ఢీకొట్టిన తర్వాత ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న కొంతమంది విద్యార్థులు కిందపడిపోయారు. మరి కొంతమంది ఆటోలోనే చిక్కుకున్నారు. దీంతో స్థానికులు పరుగులు పెట్టి వెళ్లి విద్యార్థులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ తో కలిపి అందులో 9 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో డ్రైవర్ సహా ఎనిమిది మంది గాయపడ్డారు. 🚌