top of page

👮‍♂️📰 టీడీపీని టెన్షన్ పెడుతున్న సీఐడీ చీఫ్ కామెంట్స్...

🌐 ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు సంచలనం సృష్టిస్తుంది. నిందితునిగా మాజీ సీఎం చంద్రబాబు పేరును చేర్చారు. ఏసీబీ కోర్టుకు ఇచ్చిన 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో నారా లోకేశ్ పేరును ప్రస్తావించారు.

రిపోర్ట్ లో లోకేశ్ పేరు చేర్చుతూ.. స్కాంలో ఆయన పాత్రపై విచారణ చేస్తామని చెప్పారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్. స్కిల్ కేసులో మొత్తం 10 కీలక అంశాలు ఉన్నాయని, అందులో ప్రమేయం ఉన్న వాళ్లందరికీ శిక్ష పడుతుందన్నారు. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో లోకేశ్ పేరు ఉండగా.. తాజా లోకేశ్ ను విచారణకు పిలుస్తామని.. లోకేష్ పాత్రపై దర్యాప్తు చేస్తామని జరుపుతామన్నారు. 🔒 రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసిన పవన్‌ కల్యాణ్.. ఎక్కడైనా బాబు సంతకాలు ఉన్నాయా? ప్రూఫ్ లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలకు సైతం సీఐడీ చీఫ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఎక్కడెక్కడ సంతకాలు చేశారు, ఎప్పుడు పెట్టారన్న విషయాలను మీడియాకు వెల్లడించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేశారు. బెయిల్, మధ్యంతర బెయిల్ కోసం రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. సీఐడీకి నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీఐడీ ఇవాళ కౌంటర్ దాఖలు చేయనుంది. ఈ పిటిషన్లు రేపు విచారణకు వచ్చే అవకాశముంది. 🏛️📄📢

Commenti


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page