టార్గెట్ 2024.. ఏపీలో పొలిటికల్ మిషన్ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చేసింది. ఓటర్ల జాబితాపై రాజకీయం హీటెక్కుతోంది. ఇటు వైసీపీ.. అటు టీడీపీ-జనసేన నుంచి ఓటర్ల లిస్టులో అవకతవకలపై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి.
తుఫాన్-పంటనష్టం కేంద్రంగా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్లలో తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సిందిపోయి ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడంపై ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. పవన్ కల్యాణ్‌పై కేసులు పెట్టడాన్ని ఖండించారాయన. వ్యక్తిగత ఆరోపణలకు దిగడం సరికాదన్నారు.
అలా సర్కర్ వైఖరిని ఎండగట్టడం సహా మరోవైపు 2024 ఎన్నికలు టార్గెట్‌గా అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు దృష్టిసారించనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పొత్తులో భాగంగా టీడీపీ-జనసేన సమన్వయ కమిటీలు గ్రౌండ్ లెవల్ యాక్టివయ్యాయి. ఇటు పవన్-అటు చంద్రబాబు తమ తమ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు. ముందు కలిసి నడుద్దాం. కలబడి నిలబడుదాం.. గెలుద్దాం.. ముఖ్యమంత్రి ఎవరనే ముచ్చట మేమిద్దరం చూసుకుంటామని క్యాడర్‌కు క్లారిటీ ఇచ్చారు పవన్
వచ్చే ఫిబ్రవరి లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండవద్దని టీడీపీ శ్రేణులను అప్రమత్తం చేశారు చంద్రబాబు . అంతేకాదు అభ్యర్థుల జాబితా పై కూడా దృష్టి సారించామనే సంకేతాలిచ్చారు. ముఖ్యంగా నియోజకవర్గాల ఇంచార్జిల నియామకాలపై ఫోకస్ పెట్టారాయన.కొన్ని స్థానాలకు కొత్తగా ఇంచార్జిలను నియమించడంతో పాటు గతంలో ఉన్న కొంతమందిని మార్చబోతున్నారనే చర్చ జరుగుతోంది. 🗳️🔄