ఈ క్రమంలో ఫిషింగ్ హార్బర్ లో భద్రతపై ప్రభుత్వం సీరియస్ అయింది.. ఘటనపై నిఘా సంస్థల ఆరా నేపథ్యంలో ఇప్పటికే సీపీతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి భద్రతను పెంచాలని సూచించారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో 25కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్నారు వైవీ సుబ్బారెడ్డి. బాధిత మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మంటల్లో దగ్ధమైన 36 బోట్లకు 80శాతం మేర పరిహారం అందిస్తామన్నారు. నాలుగైదు రోజుల్లోనే ఈ ఆర్ధిక సాయం అందేలా చర్యలు తీసుకుంటాని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది కృషి వల్ల ప్రాణనష్టం జరగలేదని, అధికారుల చర్యల వల్ల పక్కనున్న ఆయిల్ ట్యాంకర్‌కు మంటలు వ్యాపించలేదన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని.. నాలుగైదు రోజుల్లో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అండగా ఉంటా.. పవన్ కల్యాణ్.. 🚢🔥 విశాఖ షిప్పింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాదంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. బాధితులకు అండగా ఉంటానంటూ ప్రకటించారు. విశాఖ షిప్పింగ్ హార్బర్లో నష్టపోయిన బోట్ల యజమానులకు ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించారు. ఆయా కుటుంబాలకు JSP తరుపున నుండి యాభై వేల రూపాయలు ఆర్దిక సాయం అందించనున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ బాధితులకు స్వయంగా ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో పోస్ట్ చేశారు. 🆘💰