top of page

సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ గుండాల అరాచకం.. బీఆర్‌ఎస్‌ నేతలపై రాళ్లతో దాడి


సూర్యాపేట(Suryapet) జిల్లాలో కాంగ్రెస్ గుండాలు(Congress goons) రెచ్చిపోయారు. తిరు మలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు(BRS Acitvists), నాయకులపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్తు, కోడి గుడ్లతో దాడి చేశారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ పై దాడికి యత్నించారు. పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళన కారులను చెదరగొట్టారు. కాగా, రైతు రుణమాఫీ(Loan waiver) కోసం బీఆర్‌ఎస్‌ (BRS) పోరు బాటపట్టింది. రేవంత్‌ సర్కార్‌ మెడలు వంచి ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టింది.  రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు కదంతొక్కారు. అన్ని మండల కేంద్రాల్లో రైతుల కలిసి పార్టీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకుం టున్నప్పటికీ.. నిరసన కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని, రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page