top of page

అనంత్ అంబానీ పెళ్లి కోసం జక్కన్నకు ఇచ్చిన మాట తప్పిన సూపర్ స్టార్


దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించిన కొత్త అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన జుట్టు బాగా పెంచుతున్నాడని టాక్. అలాగే ఫిజిక్ పరంగానూ చాలా మారిపోయాడు సూపర్ స్టార్. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా పనులు ప్రారంభం కానున్నాయి.ఈ సినిమా పనులు మొదలు కాకముందే రాజమౌళి మహేష్ బాబుకు ఓ విచిత్రమైన కండిషన్ పెట్టాడట. అయితే అంబానీ పెళ్లి కోసం ఈ నిబంధనను మహేష్ బాబు బ్రేక్ చేశాడట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సక్సెస్‌ తర్వాత రాజమౌళి ఎస్‌ఎస్‌ఎంబీ29 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తెలిసిన రోజు నుంచి జనాలు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. భారతీయ చలనచిత్రం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ రివీల్ చేయకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నాడట. అందుకే మీడియాకు దూరంగా ఉండాలని మహేష్ బాబుకు సూచించాడట. అయితే ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లి కారణంగా తన లుక్‌ను మహేష్ బాబు రివీల్ చేశారు. అనంత్ అంబానీ, రాధికల వివాహానికి మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. మహేష్ బాబు తన భార్య మరియు కుమార్తెతో కనిపించాడు.. మహేష్ బాబు స్వయంగా క్రికెటర్ ఎంఎస్ ధోనితో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు. ఈ ఫోటోపై అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page