top of page

ఉసిరితో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు! 💪🍇🌿

పోష‌కాల సిరి ఉసిరితో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు (Super Fruit) చేకూర‌తాయ‌ని ప్రాచీన ఆయుర్వేదం నుంచి ఆధునిక వైద్య నిపుణుల వ‌ర‌కూ చెబుతుంటారు.

అధిక పోష‌కాలు క‌లిగిన ఉసిరి సూప‌ర్‌ఫ్రూట్‌గా పేరొందింద‌ని ప్ర‌ముఖ వైద్యులు డాక్ట‌ర్ న‌రేష్ గుప్తా చెప్పారు. విట‌మిన్ సీ పుష్క‌లంగా ఉండ‌టంతో పాటు ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండ‌టంతో శ‌రీరంలో ఫ్రీ రాడిక‌ల్స్‌పై పోరాడ‌టంతో పాటు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని ఉసిరి బ‌లోపేతం చేస్తుంది. వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్ల‌పై శ‌రీరం పోరాడే గుణాన్ని పెంచుతుంది. ఉసిరి తెల్ల ర‌క్త‌క‌ణాల‌ను ప్రేరేపించి శ‌రీర ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను మెరుగుప‌రుస్తుంది. ఇక ఉసిరి త‌ర‌చూ తీసుకుంటే జీర్ణ శ‌క్తి పెంపొందుతుంది. మ‌ల‌బ‌ద్ధ‌కం, ఎసిడిటీల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. ఉసిరిని తీసుకోవ‌డం ద్వారా పోష‌కాల‌ను శ‌రీరం మెరుగ్గా సంగ్ర‌హించేలా చేస్తుంది. ఇక ఉసిరి ర‌సాన్ని చ‌ర్మ‌, కేశ సంర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల్లో విరివిగా వాడుతారు. ఇది కొల్లాజెన ఉత్ప‌త్తిని ప్రేరేపించి చ‌ర్మం సాగే గుణాన్ని మెరుగుప‌ర‌చ‌డంతో పాటు చ‌ర్మంపై ముడ‌త‌ల‌ను త‌గ్గిస్తుంది. దీంతో జుట్టు రాల‌డం వంటి స‌మస్య‌ల‌ను నివారించ‌డంతో పాటు వెంట్రుక‌లు ఒత్తుగా పెరుగుతాయ‌ని డాక్ట‌ర్ సుష్మా సంఘ్వీ చెబుతున్నారు. 💆‍♀️🌱💆‍♂️


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page