top of page
MediaFx

రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవు.. అమిత్ షా

సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. ఏడు దశల్లో ఎన్నికలు జరగుతుండగా, ఆరు విడతలు పూర్తి అయ్యాయి. జూన్ 1వ తేదీన చివరి 7వ దశ ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు దశల పోలింగ్‌లో బీజేపీ 400 సీట్లు దాటేసిందన్నారు. కాంగ్రెస్‌కు కేవలం 40 సీట్లు మాత్రమే వస్తాయని , ఈవిషయం రాహుల్‌గాంధీకి కూడా తెలుసన్నారు. అలాగే, రాజ్యాంగాన్ని మారుస్తారంటూ చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఆయన తీవ్రంగా ఖండించారు.

400 సీట్లకు పైగా వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మారుస్తామని ఆరోపిస్తున్న వారు ఒక్కసారి ఆలోచించుకోవాలని హోంమంత్రి అమిత్ షా టీవీ9 ఇంటర్వ్యూలో అన్నారు. దేశ ప్రజలు 2014లోనే ప్రధాని నరేంద్ర మోదీకి అధికారాన్ని ఇచ్చారు. ఈ ఆరోపణలు చేస్తున్న వారికే రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియ ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. ఆ ఇంటర్వ్యూలో ముస్లిం రిజర్వేషన్లు, 6 దశల ఓటింగ్, 400 దాటడం వంటి ముఖ్యమైన అంశాలతో పాటు, కేజ్రీవాల్ నుండి కాశ్మీర్ వరకు ప్రతిదానికీ అతను ముక్తసరిగా సమాధానం చెప్పారు.

రాజ్యాంగం పేరుతో రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారని, అయితే ఈ పని వారే చేస్తున్నారని అమిత్ షా అన్నారు. బెంగాల్, కర్నాటకలో కూడా అదే చేశారు. దేశంలో ఒక్క బీజేపీ ఎంపీ కూడా ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని మార్చడానికి వీలు లేదన్నారు. దేశ రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే నిబంధన లేదన్న అమిత్ షా, ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్‌ను తీసివేయడం గురించి మాత్రమే మాట్లాడామన్నారు. వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు యధావిథిగా కొనసాగుతాయని అమిత్ షా స్పష్టం చేశారు.

bottom of page