top of page
Suresh D

అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై పుకార్లు..మరీ ఇంత దారుణమా? 😱

సెలబ్రిటీల గురించి రకరకాల పుకార్లు షికార్లు చేయడం మామూలే. కొన్ని సార్లు ఆ వార్తలు నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ విషయంలోనూ అలాగే జరిగింది. వివరాల్లోకి వెళితే..

సెలబ్రిటీల గురించి రకరకాల పుకార్లు షికార్లు చేయడం మామూలే. కొన్ని సార్లు ఆ వార్తలు నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ విషయంలోనూ అలాగే జరిగింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం (మార్చి 15)ఉదయం నుంచే అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై అబద్ధపు వార్తలు హల్ చల్ చేశాయి. తీవ్ర అనారోగ్యంతో బిగ్ బీ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వ్యాపించాయి. అంతే కాదు యాంజియోప్లాస్టీ కూడా చేయించుకున్నట్లు కథలు అల్లారు. దీంతో బిగ్ బికి గుండె సమస్య తలెత్తిందని అభిమానులు కంగారు పడ్డారు.అలాగే ఆయన కాలులోని సిరలో సమస్య వచ్చిందని నెట్టింట వార్తలు వచ్చాయ. అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అట.. అసలు అమితాబ్ కు ఎలాంటి సమస్యలు తలెత్తలేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. నిజానికి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐఎస్‌పిఎల్) ఫైనల్ మ్యాచ్‌ని చూడటానికి ముంబై వచ్చారు అమితాబ్. ‘ ముంబై’, ‘టైగర్స్ ఆఫ్ కోల్‌కతా’ మధ్య జరిగిన ISPL ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ను బాగా ఎంజాయ్ చేశారు. కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి ముంబై జట్టుకు మద్దతుగా నిలిచారు. సచిన్ టెండూల్కర్ కూడా వారితో ఉన్నాడు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అందులో చేయి ఊపుతూ అందరికీ అభివాదం చేశారు. అయితే ఇంతలోనే అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. అభిమానులు ఆందోళన చెందారు. దీంతో అమితాబ్ స్వయంగా తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానంటూ స్పష్టత నిచ్చారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అమితాబ్ పై ఇంత పెద్ద ఫేక్ న్యూస్ ఎవరు స్ప్రెడ్ చేశారనే ప్రశ్న తలెత్తింది. అమితాబ్ బచ్చన్ వయసు ఇప్పుడు 81 ఏళ్లు. ఇలాంటి సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తితే ఎవరైనా కలత చెందుతారు. అమితాబ్ అభిమానులు కూడా అలాగే ఆందోళన చెందారు. అయితే బిగ్ బీ క్లారిటీ ఇవ్వడం, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలియడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


bottom of page