top of page
Suresh D

1200 ఏళ్లనాటి సమాధి తవ్వే కొద్దీ షాక్ అవుతున్న శాస్త్రవేత్తలు 😲

12 శతాబ్దాల నాటి సమాధిని తవ్వుతుండగా బంగారు, విలువైన వస్తువులు బయటపడడంతో శాస్త్రవేత్తలు విస్తుపోయారు.

12 శతాబ్దాల నాటి సమాధిని తవ్వుతుండగా బంగారు, విలువైన వస్తువులు బయటపడడంతో శాస్త్రవేత్తలు విస్తుపోయారు. మధ్య అమెరికా దేశం పనామాలో బంగారు నిధులతో ఉన్న సమాధిని పురావస్తు నిపుణులు గుర్తించారు. తవ్వకాలు జరపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పనామా సిటీకి 100 మైళ్ల దూరంలో ఉన్న ఎల్‌కానో ఆర్కియాలాజికల్ పార్కులో 1200 సంవత్సరాల నాటి సమాధి బయటపడింది. సమాధిలో చాలా వరకూ మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. వాటితోపాటు పెద్ద ఎత్తున బంగారు నిధి వెలుగులోకి వచ్చింది. బంగారంతో తయారు చేసిన దుస్తులు, బ్రాస్‌లెట్లు, గంటలు, బెల్టులు, తిమింగలం పన్నుతో అలంకరించిన చెవి పోగులు, నగలు, సిరామిక్ వస్తువులు వంటివి పెద్ద సంఖ్యలో లభ్యమయ్యాయి. దీనిన కోక్లే సంస్కృతికి చెందిన ఉన్నత వర్గం ప్రభువు సమాధిగా పరిశోధకులు భావిస్తున్నారు. ఇక్కడే మరో 32 మృతదేహాల అవశేషాలు కూడా బయటపడ్డాయి. ఉన్నత వర్గానికి చెందిన ప్రభువు మరణించడంతో అప్పటి ఆచారాల ప్రకారం ఈ 32 మందిని బలి ఇచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, కచ్చితంగా ఈ సంఖ్య ఎంత ఉంటుందనే అంశంపై విచారణ జరుపుతున్నారు. 😮

bottom of page