ఆఫ్రికన్-అమెరికన్ నటి, గాయని మేరీ మిల్బెన్ మణిపూర్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా నిలిచారు. ఈశాన్య రాష్ట్ర ప్రజల కోసం తాను ఎప్పుడూ పోరాడతానని చెప్పారు. తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిస్పందనగా పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ప్రసంగించిన తర్వాత ఆమె స్పందించారు.
ఆఫ్రికన్-అమెరికన్ నటి, గాయని మేరీ మిల్బెన్ మణిపూర్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా నిలిచారు. ఈశాన్య రాష్ట్ర ప్రజల కోసం తాను ఎప్పుడూ పోరాడతానని చెప్పారు. తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిస్పందనగా పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ప్రసంగించిన తర్వాత ఆమె స్పందించారు. భారత్‌కు తమ నాయకుడిపై విశ్వాసం ఉందని మేరీ మిల్బెన్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొన్నారు.వాస్తవాలు లేకుండా ప్రతిపక్షాలు భారీ ఎత్తున నినాదాలు చేస్తున్నాయని మేరీ మిల్బెన్ ఉద్ఘాటించారు. ప్రధాని మోడీపై తనకు నమ్మకం ఉందని, ఆయన కోసం ప్రార్థిస్తున్నానని మిల్బెన్ చెప్పారు. నిజాయితీ లేని జర్నలిజం తప్పుడు కథనాలను చిత్రిస్తుందని మేరీ మిల్బెన్ అన్నారు. వాస్తవాలు లేకుండా ప్రతిపక్షాల గొంతుకలు వినిపిస్తున్నాయి. కానీ సత్యం ఎల్లప్పుడూ ప్రజలను స్వతంత్రులను చేస్తుంది. మై డియర్ ఇండియా.. సత్యాన్ని గ్రహించండి అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ.. మీపై నాకు నమ్మకం ఉందని మద్దతు చెప్పారు.💪🗣️📢