top of page

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి కాల్పులు... నలుగురు మృతి!

అమెరికాలో నిత్యం ఏదో ఒక చోట కాల్పుల శబ్ధాలు వినిపిస్తూనే ఉంటాయనేలా వార్తలు వస్తుంటాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని శివారు ప్రాంతాల్లో గన్ కల్చర్ ఎక్కువనే మాటలు వినిపిస్తుంటాయి. ఈ మాటలకు బలం చేకూర్చే సంఘటనలు నిత్యం ఏదో ఒక మూల తెరపైకి వస్తూనే ఉంటాయి. ఇందులో భాగంగా తాజగా బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ ధరిం ఒక వ్యక్తి సామూహిక కాల్పులకు తెగబడ్డాడు.

అవును... యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరోసారి భయంకరమైన సామూహిక కాల్పులతో దద్దరిల్లిపోయింది. అమెరికా దేశంలోని ఫిలడెల్ఫియాలో మరోసారి కాల్పులు జరిగాయి. ఫిలడెల్ఫియాలోని కింగ్ సెసింగ్ సెక్షన్ లో సోమవారం రాత్రి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన ఒక వ్యక్తి జనంపై ఉన్నపలంగా కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. తనవద్ద ఉన్న తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.ఈ ఊహించని పరిణామంనుంచి తేరుకున్న జనం భయంతో పరుగులు తీయగా.. అప్పటికే గాయపడినవారి హాహాకారాలతో ఆ ప్రాంతం మొత్తం భయంకరంగా మారింది. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారని తెలుస్తుంది. మరణించిన వారిలో ఒక యువకుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారని సమాచారం. ఇదే క్రమంలో గాయపడినవారిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం.ఫిలడెల్ఫియాలోని 56 వ వీధి చెస్టర్ అవెన్యూ వద్ద ఈ కాల్పులు జరిగాగా... ఈ కాల్పులకు తెగబడ్డ వ్యక్తి వయసు 40 ఏళ్లు గా పోలీసులు గుర్తించారని అంటున్నరు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... విచారణ జరుపుతున్నారు హత్యాకాండ జరిగిన ప్రదేశం నుంచి మూడు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కాల్పుల్లో గాయపడిన వారిని పెన్ ప్రెస్బిటేరియన్ చిల్డ్రన్స్ ఆసుపత్రికి తరలించారని తెలుస్తుంది. ఫ్రేజియర్ స్ట్రీట్ 1800 బ్లాక్ లో కాల్పులు జరిగిన కొద్దిసేపటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఫిలడెల్ఫియా పోలీసులు చెబుతున్నారంట. నిందితుడు బుల్లెట్ ప్రూఫ్ చొక్కా ధరించి ఉన్నాడని ఆయన వద్ద రైఫిల్ తుపాకులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారని తెలిసింది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page