top of page
MediaFx

అల్లు శిరీష్ కొత్త సినిమా 'బడ్డీ' నుండి 'ఆపిల్లకనులే' సాంగ్ విడుదల! 🎶

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని సామ్ ఆంటోన్ దర్శకత్వంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'బడ్డీ' అనే టైటిల్‌ను లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రంలోని ఆపిల్లకనులే వీడియో సాంగ్ ను ఈరోజు ఉదయం 10.30 గంటలకు విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.ఈ చిత్రం తమిళ నటుడు ఆర్య యొక్క 'టెడ్డి'కి అధికారిక రీమేక్. స్టూడియో గ్రీన్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఇ. జ్ఞానవేల్రాజా, ఆధాన జ్ఞానవేల్రాజా 'బడ్డీ'ని నిర్మిస్తున్నారు. అజ్మల్ అమీర్, ప్రిషా రాజేష్ సింగ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ అలీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.


bottom of page