top of page
MediaFx

అల్లు అర్జున్ రూ.10 కోట్ల యాడ్ ఆఫర్ ని తిరస్కరించాడు! 🚫🌟

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏కు వరల్డ్ వైడ్ ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. పుష్ప సినిమాతో బన్నీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. పుష్పరాజ్ పాత్రలో అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు.

పుష్ప సినిమా తర్వాత బన్నీతో తమ ఉత్పత్తులను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసేందుకు ఎన్నో కంపెనీలు పోటీపడ్డాయి. కొన్ని యాడ్స్ కూడా చేశారు బన్నీ. కానీ ఓ అంతర్జాతీయ సంస్థకు ఆఫర్ మాత్రం సున్నితంగా రిజెక్ట్ చేశారట. సదరు సంస్థ నిమిషం యాడ్ కోసం రూ.10 కోట్లు ఆఫర్ చేసినా అసలు చేయనని చెప్పేశారట.

పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ప్రకటనలలో నటిస్తే తన అభిమానులను, శ్రేయోభిలాషులకు చెడును వ్యాప్తి చేసినట్లు అవుతుందని అన్నారట. అందుకు తనకు ఎంతో రెమ్యునరేషన్ ఇచ్చినా చేయనని అన్నారట. మే31న ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవ సందర్భంగా బన్నీ తీసుకున్న ఈ సూపర్ డెసిషన్ న్యూస్ మరోసారి నెట్టింట వైరలవుతుంది. అప్పట్లో బన్నీ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసుల కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

bottom of page