top of page
Suresh D

వైజాగ్ లో అల్లు అర్జున్ బిజినెస్.. ఇంతకీ అదేమిటంటే!🎥✨

అల్లు అర్జున్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు నగరంలో మల్టీప్లెక్స్ థియేటర్లను రన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కు AAA, మహేశ్ బాబుకు AMB, అలాగే విజయ్ దేవరకొండ కు VD పేరుతో హైదరాబాద్ నగరంలో మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నాయి.

ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమలో థియేటర్ బిజినెస్ బాగా ఊపందుకుంది. స్టార్ హీరోలు సైతం ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అల్లు అర్జున్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు నగరంలో మల్టీప్లెక్స్ థియేటర్లను రన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కు AAA, మహేశ్ బాబుకు AMB, అలాగే విజయ్ దేవరకొండ కు VD పేరుతో హైదరాబాద్ నగరంలో మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నాయి. త్వరలోనే మాస్ మహరాజా ర‌వితేజ కూడా మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్ట‌బోతున్నారు. ఏషియన్ సంస్థతో కలిసి ART సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో AAA పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్ నిర్వహిస్తున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన బిజినెస్ ను మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నాడట. అయితే ఇప్పుడు తెలంగాణ‌లో కాదు ఏపీలో. అవును విశాఖపట్నంలో అల్లు అర్జున్ AAA మల్టీప్లెక్స్ కు ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకోసం వైజాగ్‌లో కొత్తగా కడుతున్న ఇనార్బిట్ మాల్‌లో ఆసియన్ సంస్థతో కలిసి హైదరాబాద్‌లో ఉన్నట్లే మల్టీప్లెక్స్ థియేటర్ ను ఏర్పాటుచేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.🎥✨

bottom of page