top of page

ఇద్దరు అర్జున్‌లను హ్యాండిల్ చేయగలవా?

అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. దుబాయ్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని గురువారం నాడు ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మైనపు విగ్రహాన్ని చూసేందుకు అల్లు ఫ్యామిలీ అంతా కదిలింది. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, శిరీష్, అర్హ, అయాన్ ఇలా అందరూ కూడా మైనపు విగ్రహంతో పోజులు పెట్టి సందడి చేస్తున్నారు. ఇక ఈ మైనపు విగ్రహంతో బన్నీ, స్నేహా రెడ్డిలు ఇచ్చిన పోజు వైరల్ అవుతోంది.మామూలుగానే బన్నీ తన భార్య స్నేహా రెడ్డి మీద ఎప్పుడూ సెటైర్లు వేస్తుంటాడు. క్యూటీ అని పిలుస్తాడు. సెక్సీగా ఉంది కదా? అని అంటాడు. అయితే తాజాగా మైనపు విగ్రహంతో పోజులు ఇచ్చినప్పుడు కొంటెగా కామెంట్ చేశాడు. క్యూటీ.. ఇద్దరు అర్జున్‌లను హ్యాండిల్ చేయగలవా? అంటూ కామెంట్ చేశాడు. మరి దీనికి అయితే ఇంత వరకు స్నేహారెడ్డి రిప్లై ఇవ్వలేదు. మరి బన్నీ కామెంట్‌కు స్నేహా రెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page