top of page
MediaFx

యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న పుష్ప 2 సాంగ్! 🌟🎬

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మొదటి సింగిల్ ని పుష్ప పుష్ప అనే టైటిల్ తో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషలలో విడుదల చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకరాం, ఈ సాంగ్ యూట్యూబ్ లో 2.26M లైక్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

bottom of page