top of page

తెలుగులోకి మరో బాలీవుడ్ హీరో ఎంట్రీ..

ఇప్పటికే బాలీవుడ్ స్టా్ర్ సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ సినిమాలో నటించగా.. ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రాబోతున్న దేవర చిత్రంలోనూ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా జరుగుతుండగా.. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం ఇప్పుడు మరో హీరో తెలుగు సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ మూవీస్ సెన్సెషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్, కాంతార, కేజీఎఫ్ వంటి సినిమాల ఎఫెక్ట్‏తో ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ చూపు సౌత్ పై పడింది. ఇప్పటికే హీరోయిన్స్ తెలుగులో పలు చిత్రాలు చేస్తూ సౌత్ ఆడియన్స్ కు దగ్గరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరోస్ సైతం తెలుగు తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టా్ర్ సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ సినిమాలో నటించగా.. ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రాబోతున్న దేవర చిత్రంలోనూ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా జరుగుతుండగా.. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారంరణ్వీర్ సింగ్ పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న హీరో. కేవలం నార్త్ లోనే కాకుండా.. సౌత్ ఇండస్ట్రీలోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో.. ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ మూవీలో నటించనున్నారట. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన పుష్ప చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో పుష్ప 2పై ఇప్పుడు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే పుష్ప 2 గురించి ఇప్పటికే ఆసక్తికర విషయాలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఇందులో రణ్వీర్ సింగ్ కీలకపాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.ఈ సినిమాలో రణ్వీర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని.. గొప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్ గా అతని రోల్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా.. అతని పాత్ర ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తోంది. సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప 2లో పరిచయం కానున్నాయి. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page