top of page

బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ప్రచారం చేయనున్న బన్నీ.?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సిద్ధమవుతున్నారు. అల్లు అర్జున్‌కు పిల్లను ఇచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడుగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కొనసాగుతున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సిద్ధమవుతున్నారు. అల్లు అర్జున్‌కు పిల్లను ఇచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడుగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కొనసాగుతున్నారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి. అయితే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. 2014లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన పోటీచేసి ఓడిపోయారు. ఇందులోభాగంగానే తన అల్లుడైన ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ రంగంలోకి దింపుతున్నారు. నియోజకవర్గంలో తన రాజకీయ కార్యక్రమాలను ప్రారంభించడానికి పెద్దవూర సమీపంలోని ముసలమ్మ చెట్టు వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో నిర్మించిన కార్యాలయం, ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించేందుకు ఈనెల 19న అల్లు అర్జున్ వస్తున్నారు. ముసలమ్మ చెట్టు వద్ద పది వేల మందితో సభ నిర్వహించేందుకు చంద్రశేఖర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు, అల్లు అర్జున్ అభిమానులకు ఇక్కడే భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page