top of page

‘పుష్ప 2’ డైలాగ్‌ లీక్‌ చేసిన అల్లు అర్జున్‌..

డైరెక్టర్ సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విడుదలైన వారం రోజుల్లోనే భారీగా వసూళ్లు రాబట్టి థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.

డైరెక్టర్ సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విడుదలైన వారం రోజుల్లోనే భారీగా వసూళ్లు రాబట్టి థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించినందుకు గానూ మేకర్స్ గురువారం సాయంత్రం హైదరాబాద్లో బేబీ ప్రసంశా సమావేశం నిర్వహించగా.. బన్నీ అతిథిగా వచ్చారు. ఈ వేదికపై బన్నీ మాట్లాడుతూ ఫ్యాన్స్ కోరిక మేరకు పుష్ప 2 డైలాగ్ చెప్పారు.పుష్ప 2.. ది రూల్.. “ఇడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుండాది..అదే పుష్పగాడి రూల్.” అంటూ పుష్ప 2 డైలాగ్ చెప్పారు. ప్రస్తుతం బన్నీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. అయితే పుష్ప 2లో బన్నీ, ఎస్పీ భన్వర్ సింగ్ షేకావత్ మధ్య ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని.. పార్ట్ 2 మొత్తం ఎక్కుగా సంఘర్షణల మధ్య తిరుగుతుంటుందని సమాచారం.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page