top of page

🌍 ప్రపంచం మొత్తం చూపు ఇస్రో వైపు.. 🚀

🛰️ ఇస్రో ఇటీవల ప్రయోగాల సంఖ్య బాగా పెంచింది. ఇస్రో ఆవిర్భవించిన తొలినాళ్ళలో ఏడాదికి ఒకటి లేదా రెండు ప్రయోగాలు మాత్రమే జరిగేవి. ప్రయోగాల సంఖ్య కంటే.. విజయాలే ముఖ్యమనే భావనలో ఆచి తూచి ప్రయోగాలు చేపట్టేదీ ఇస్రో.

గత ఐదేళ్లుగా ఏడాదికి 12 ప్రయోగాలు తక్కువ కాకుండా ఉండేలా క్యాలెండర్‌ను సిద్ధం చేసుకుని లక్ష్యం దిశగా వెళుతోంది. అయితే కోవిడ్ కారణంగా రెండేళ్లు ఇస్రో లక్ష్యాలను పూర్తిగా ఇబ్బంది పెట్టింది. 2020, 2021 లో ప్రయోగాలపై తీవ్ర ప్రభావం చూపింది. 2020 లో కేవలం రెండు ప్రయోగాలు మాత్రమే జరిగాయి. ఇక, 2021లో కూడా టార్గెట్ ఎక్కువగానే ఉన్నా అతి కష్టం మీద రెండు ప్రయోగాలను చేపట్టగలిగింది ఇస్రో. ఇక. 2022లో ఐదు ప్రయోగాలు చేపట్టి విదేశాలకు సంబంధించిన ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది.

🚢 సరికొత్త వాహక నౌక స్మాల్ శాటిలైట్ లాంచ్

🌐 **ఇక, చిన్న ఉపగ్రహాలను నింగిలోకి తక్కువ ఖర్చుతో పంపేందుకు ఇస్రో సరికొత్త వాహక నౌక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) రూపొందించింది. 2022 లోనే దీన్ని ప్రయోగించిన అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. 2023 ఫిబ్రవరిలో లోపాలను సవరించి విజయవంతం చేసింది. ఇక చంద్రయాన్ – 3 జరిగిన నెలల వ్యవధిలోనే సూర్యుడిపై ప్రయోగం కోసం ఆదిత్య ఎల్ 1 ప్రయోగం చేపట్టింది. ప్రస్తుతం నిర్దేశిత గమ్యం దిశగా ఆదిత్య ప్రయాణం కొనసాగుతోంది. ఇలా 2023 లో మొత్తం 8 ప్రయోగాలను చేపట్టింది ఇస్రో. ఆరు దశాబ్దాల ఇస్రో ప్రయాణంలో 2023 కీలకమనే చెప్పాలి. 🚀

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page