top of page

అదే పనిగా ఇయర్ బడ్స్ పెట్టుకుంటున్నారా..? ఆ సింగర్‌లాగే మీకూ అరుదైన వ్యాధి 🎧🚨

అల్కా యాజ్నిక్… మనకు ఈ పేరు పెద్దగా తెలియకపోయినా, బాలీవుడ్‌లో ఫుల్‌ ఫేమస్. 25 భాషల్లో 21 వేలకు పైగా పాటలు… ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు. ముఖ్యంగా 90ల్లో ఇండస్ట్రీని ఊపు ఊపేశారు. 2022లో మోస్ట్ స్ట్రీమ్డ్‌ ఆర్టిస్ట్‌గా గిన్నీస్‌ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ స్టార్‌ సింగర్‌ అరుదైన వ్యాధితో వినికిడి కోల్పోవడం చర్చనీయాంశం. హెడ్‌ఫోన్స్‌, ఇయర్‌బడ్స్‌ వాడకంపై ఆందోళన మొదలైంది.

అల్కా యాజ్నిక్‌ న్యూరల్ నెర్వ్ సెన్సోరీ లాస్ అనే అరుదైన సమస్య బారిన పడ్డారని సోషల్ మీడియాలో తెలిపారు. కొన్ని వారాల క్రితం విమానం దిగి వస్తుండగా తనకేం వినబడలేదని, రెండు చెవులు వినపడకపోవడంతో డాక్టర్లను సంప్రదించగా న్యూరల్‌ నెర్వ్‌ సెన్సోరీ లాస్‌ అనే వ్యాధి ఉన్నట్లు చెప్పారు.

అల్కా యాజ్నిక్‌ హెడ్‌ఫోన్స్‌ ఎక్కువగా వాడటం తగ్గించాలని, పెద్ద సౌండ్‌తో పాటలు వినడం మానుకోవాలని అందరికీ సలహా ఇస్తున్నారు. బెస్ట్‌ ఫీమేల్‌ ప్లేబాక్‌ సింగర్‌గా ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు జాతీయ చలనచిత్ర అవార్డులను కైవసం చేసుకున్న ఆమె, చిన్నప్పట్నుంచి పౌరాణిక సినిమాలు ఇష్టపడేవారు. 10 సంవత్సరాల వయస్సులో ముంబైకి వచ్చి తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆమె పాటలకు పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది.

మొత్తంగా, అల్కా యాజ్నిక్‌ ఎదుర్కొంటున్న అరుదైన సమస్య అందరినీ భయానికి గురిచేస్తోంది. ఎక్కువగా హెడ్‌ఫోన్స్‌ పెట్టుకోవడం, ఇయర్‌ బడ్స్‌తో లౌడ్‌ సౌండ్‌ వినడం వల్లే ఈ సమస్య వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page