top of page
Shiva YT

అంతరిక్షంలో మనలాంటి గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా?

కేవలం భూమి మీదే జీవజాలం ఉందా? అంతరిక్షంలో మనలాంటి గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా? అక్కడ జీవం ఉందా.... గ్రహాంతరవాసులు జీవిస్తున్నారా? సమాధానాల కోసం చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. గ్రహాంతరవాసులపై కచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ..


కేవలం భూమి మీదే జీవజాలం ఉందా? అంతరిక్షంలో మనలాంటి గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా? అక్కడ జీవం ఉందా…. గ్రహాంతరవాసులు జీవిస్తున్నారా? సమాధానాల కోసం చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. గ్రహాంతరవాసులపై కచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ.. ఏదో ఒక గ్రహంపై జీవిస్తున్నారనేదే అందరి నమ్మకం. వాటికి మరింత ఊతమిచ్చే ఘటన తాజాగా చోటు చేసుకుంది. భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్‌ చేసిన ఓ సమాచారాన్ని యూరప్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్‌ ట్రేస్‌ గ్యాస్‌ ఆర్బిటార్‌ (TGO) భూమికి చేరవేసింది. అంగారకుడి చుట్టూ తిరుగుతూ అక్కడి పరిస్థితులను నిశితంగా గమనించేందుకు యూరప్‌ స్పేస్‌ ఏజెన్సీ టీజీవోను గతంలో ప్రయోగించింది. అయితే, ఈ సందేశాన్ని గ్రహాంతర వాసులే పంపించారా? అనే దానిపై స్పష్టత లేదు. అయితే, ఎన్‌కోడ్‌ చేసిన ఆ సందేశంలో ఏముందో తెలుసుకోవడం శాస్త్రవేత్తలకు కఠిన సమస్యగా మారింది. దానిని డీకోడ్‌ చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవారికి అవకాశం కల్పించారు. శాస్త్రసాంకేతిక పరంగానే కాకుండా ఆ సందేశంలో సాంస్కృతిక పరమైన అంశాలేమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ పరిశీలించేందుకు సమాయత్తమవుతున్నారు. అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్‌ చేసి వచ్చిన సిగ్నల్స్‌ను asignin.space వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆసక్తి ఉన్న వారు వాటిని డీ కోడ్‌ చేసి, దాని అర్థాన్ని తిరిగి వారికి పంపించవచ్చు.



bottom of page