top of page
Shiva YT

🚨🌧️🚨 తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్..

🌧️🚫🌊 తెలుగు రాష్ట్రాలను వర్షాలు విడిచిపెట్టడం లేదు. నిన్న ఒక్కరోజు కాస్త గ్యాప్ ఇచ్చిన వర్షాలు.. 🌧️🚫🌊 నేటి నుంచి మళ్లీ కంటిన్యూ కానున్నాయి.

ఇప్పటికే.. ఏపీ, తెలంగాణలో ఎడతెరపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 🌊🌧️🚜 గోదావరికి.. వరద పోటెత్తుతుండటంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. అయితే, వర్షాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. 🌧️🚫🌊 వానలు కాస్త గ్యాప్ ఇచ్చాయనుకునే లోపే హైదరాబాద్ వాతావరణ శాఖ మరో బాంబ్ లాంటి వార్త పేల్చింది. 🌧️🚫🌊 ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ దగ్గరలోని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో నేటినుంచి మూడు, నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందగా.. 🌧️🌊 రేపు, ఎల్లుండి మాత్రం పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది హైదరాబాద్‌ వాతావరణ శాఖ. ఇప్పటికే.. 🌧️🌊 హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసింత వర్షం తగ్గినా.. వరద మాత్రం అలానే కొనసాగుతూనే ఉంది. 🌧️🌊

bottom of page