top of page
Shiva YT

🚨✈️ ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ రూట్‌లో వందే భారత్ రైలు రద్దు..

🚂🚨 ప్రయాణీకులకు ముఖ్యగమనిక. మరీ ముఖ్యంగా అయోధ్య వెళ్లేవారికి ఈ అలెర్ట్. వందేభారత్ రైలుతో పాటు మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను వారం పాటు రద్దు చేసింది భారతీయ రైల్వే.

జనవరి 16 నుంచి 22 వరకు అయోధ్య వైపు వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయోధ్యలో ప్రస్తుతం రైల్వే ట్రాక్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుండటంతో.. ముందస్తుగా రైళ్లను రద్దు చేసింది. అలాగే డూన్ ఎక్స్‌ప్రెస్ సహా మరో 35 రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి.

🚂🔧 ఇప్పటికే అయోధ్య కాంట్ నుండి ఢిల్లీకి వెళ్లే వందే భారత్ రైలును ట్రాక్ నిర్వహణ కారణంగా జనవరి 15 వరకు రద్దు చేసినట్లు నార్తర్న్ రైల్వే స్పష్టం చేసింది. ఇక ఈ డబ్లింగ్ పనులు కారణంగా ఆ రైలు రద్దును జనవరి 22 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రామ్‌లల్లా పవిత్రోత్సవానికి జరుగుతున్న సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని, అయోధ్య రైల్వే సెక్షన్‌లో ట్రాక్ డబ్లింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. 🔧🚂

bottom of page