top of page

అక్కినేని హీరో కోసం రంగంలోకి యంగ్ రెబల్ స్టార్..

ఏజెంట్ సినిమా కోసం అఖిల్ చాలానే శ్రమించాడు. సిక్స్ ప్యాక్ చేశాడు..బరువు పెరిగాడు. ఇప్పటివరకు లవర్ బాయ్‏లా కనిపించిన అఖిల్.. ఈ సినిమా కోసం పూర్తిగా మాస్ యాక్షన్ హీరోగా తన లుక్ మార్చేశాడు. ఇందుకు భయంకరమైన డైట్ ఫాలో అయ్యాడు. అతని కష్టం ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తుంది.


అక్కినేని హీరో అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఇందులో నూతన కథానాయిక సాక్షి వైద్య నటిస్తుంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది సాక్షి. ఈ సినిమా కోసం అఖిల్ చాలానే శ్రమించాడు. సిక్స్ ప్యాక్ చేశాడు..బరువు పెరిగాడు. ఇప్పటివరకు లవర్ బాయ్‏లా కనిపించిన అఖిల్.. ఈ సినిమా కోసం పూర్తిగా మాస్ యాక్షన్ హీరోగా తన లుక్ మార్చేశాడు. ఇందుకు భయంకరమైన డైట్ ఫాలో అయ్యాడు. అతని కష్టం ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లె విడుదల చేయనున్నారు. ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి.ఏప్రిల్ 23న హైదరాబాద్ లో ఏజెంట్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా రాబోతున్నారట. ఈ విషయంపై ఇప్పటికే నెట్టింట చర్చ జరుగుతుంది. అఖిల్ ను సపోర్ట్ చేయడానికి ప్రభాస్ రానున్నాడట. ప్రభాస్ వస్తే ఈ సినిమా పాన్ ఇండియా ప్రేక్షకులకు రీచ్ అవ్వడం సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page