top of page

అన్నయ్య నిశ్చితార్థంలో అఖిల్ కొత్త లుక్ చూశారా..?


అఖిల్ నెక్స్ట్ సినిమా అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ సబ్జెక్టు తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఆ సినిమా షూటింగ్ కూడా జరుగుతుందని సమాచారం. ఈ సినిమాకి ధీర, తారక సింహా రెడ్డి.. అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా రూమర్స్ మొదలైనప్పటి నుంచి అఖిల్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. బాగా జుట్టు పెంచేసి, ఫుల్ గా గడ్డం పెంచేసి కనిపిస్తున్నాడు.

తాజాగా నాగచైతన్య – శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరగ్గా ఈ నిశ్చితార్థంలో కూడా అఖిల్ సరికొత్త లుక్ లో కనిపించాడు. ఆల్మోస్ట్ భుజాలని దాటేలా జుట్టు పెంచాడు అఖిల్. గడ్డం కూడా బాగానే పెంచాడు. ఈ లుక్ చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సినిమా కోసమే ఈ లుక్ అయితే అసలే ఫ్లాప్స్ లో ఉన్న అఖిల్ తో ఏం ప్రయోగాలు చేస్తున్నారో అని చర్చించుకుంటున్నారు. మరి ఈ కొత్త లుక్ అఖిల్ నెక్స్ట్ సినిమాకి ఎంత బాగా సెట్ అయిందో సినిమా వచ్చేదాకా చెప్పలేం.

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page