top of page

చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలక పాత్ర 🌕🚀

జాబిల్లిపై పరిశోధనల కోసం, భారత రోదసీ యాత్రలో మరో ముందడుగు వేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పటివరకు ఏ దేశం వెళ్లని.. చంద్రుని దక్షిణ ధ్రువంపై పరిశోధనల కోసం ఇస్రో ఈ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టింది.

ఈ చంద్రయాన్ 3 నింగిలోకి ఎగరగానే 140 కోట్ల మంది భారతీయులు సగర్వంగా తలెత్తుకున్నారు. ఇది మన దేశం సాధించిన విజయమని.. ఇస్రోను ఆకాశానికి ఎత్తారు. అయితే ఇంతటి ముఖ్యమైన చంద్రయాన్ 3 ప్రయోగం వెనుక కొన్ని వేల మంది కృషి.. కొన్నేళ్లుగా ఉంటుంది. అయితే ఈ చంద్రయాన్ 3 విజయవంతం కావడానికి కీలక పాత్ర పోషించిన 3 వేల మందికి దాదాపు ఏడాదిన్నరగా జీతాలు ఇవ్వలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక నివేదిక బయటకు వచ్చింది. చంద్రయాన్‌ 3 లాంచ్‌ప్యాడ్‌‌ను జార్ఘండ్‌లోని రాంచీలో ఉన్న హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ - హెచ్‌ఈసీ సిద్ధం చేసింది. అయితే లాంచ్‌ప్యాడ్ తయారీకి ఇచ్చిన గడువుకు ముందే సిద్ధం చేసిన హెచ్‌ఈసీ.. 2022 డిసెంబర్‌లోనే వాటిని ఇస్రోకు అందజేసింది. అయితే హెచ్ఈసీలో పనిచేసే ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌లకు గత 17 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఐఏఎన్‌ఎస్‌ వార్తాసంస్థ తాజాగా వెల్లడించింది. అయితే హెచ్ఈసీలో పనిచేసే 3 వేల మందికి జీతాలు ఇవ్వకున్నా గడువుకు ముందే కీలక పరికరాలు, సామగ్రిని ఇస్రోకు అందంచినట్లు తెలిపింది. జీతాల చెల్లింపుల్లో సమస్య ఉన్నా లాంచ్‌ప్యాడ్‌ సహా ఇతర కీలక సామాగ్రిని ముందే డెలివరీ చేసినట్లు పేర్కొంది. 🚀

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page