top of page

నాగబాబుకు కీలక పదవి..


కేబినెట్ విస్తరణ ముగిసి అంతా సద్దుమణిగిన నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తొలుత రాష్ట్ర స్థాయి పదవులను భర్తీ చేయాలని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలను తెలియజేయాలని ఆయా శాఖల అధిపతులను సాధారణ పరిపాలనా శాఖ ఇటీవల ఆదేశించింది. ఈ క్రమంలోనే టీటీడీ ఛైర్మన్ రేసులో నాగబాబు పేరు వినిపిస్తోంది. ఇవాళ జనసేన కార్యాలయంలో నామినేటెట్ పోస్టుల భర్తీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం శ్రమించిన వారిని మరిచిపోమని.. హరిప్రసాద్ లాగే అందరికీ గుర్తింపు ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఛైర్మన్ పదవి కావాలని అడుగుతున్నారని.. ఒక్క టీటీటీ ఛైర్మన్ పదవి కోసమే 50 మంది అడిగారని , ఒక్క పదవిని ఎంత మందికని ఇస్తారని పవన్ ప్రశ్నించారు.


ఇదే సమయంలో నాగబాబు పదవి విషయంలోనూ ఆయన క్లారిటీ ఇచ్చారు. తన కుటుంబ సభ్యులెవరూ టీటీడీ ఛైర్మన్ పదవి కోరలేదని , అయినా వారు అడిగినట్లుగా ప్రచారం జరుగుతోందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పదవుల కోసం చంద్రబాబును ఎలా అడగాలో తెలియడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కానీ అందరికీ న్యాయం చేయమని కోరతానని.. మోడీ కూడా కేంద్రంలోకి రావాలని ఆహ్వానిస్తున్నారని అడగాల్సిన టైంలో అడుగుతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తద్వారా నాగబాబుకు టీటీడీ ఛైర్మన్ గిరి గ్యారెంటీ అంటూ గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి పవన్ తెరదించారు. మరి నాగబాబును జనసేనాని ఎలా గౌరవించుకుంటారో చూడాలి.




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page