top of page
Suresh D

ఒక్క ప్లాన్‌తో ‘అన్‌లిమిటెడ్’ ప్రయోజనాలు..✨

ఎయిర్ టెల్ కంపెనీ దేశంలోనే అతి పెద్ద రెండో నెట్ వర్క్ గా దూసుకుపోతోంది. రిలయన్స్ జియోకు పోటీగా మార్కెట్ లో పరుగులు పెడుతోంది.

ఎయిర్ టెల్ కంపెనీ దేశంలోనే అతి పెద్ద రెండో నెట్ వర్క్ గా దూసుకుపోతోంది. రిలయన్స్ జియోకు పోటీగా మార్కెట్ లో పరుగులు పెడుతోంది. ఇటీవల ఈ కంపెనీ వినియోగదారుల సంఖ్య 370 మిలియన్లు దాటింది. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ కంపెనీ తన వినియోగదారులను మరింత పెంచుకునేందుకు చర్యలు తీసుకుంది. రీచార్జులపై అనేక ఆఫర్లు అందజేస్తుంది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్న ప్లాన్‌లను ప్రారంభించింది. టాక్ టైం, నెట్ బ్యాలెన్స్ తో పాటు వీటిని అదనంగా అందజేస్తుంది. ఆ రీచార్జ్ ప్లాన్ల వివరాలు తెలుసుకుందాం. 

రూ.839 రీచార్జ్ ప్లాన్ . ఈ ప్లాన్ ద్వారా 84 రోజుల పాటు వివిధ నెట్ వర్క్ ల ఫోన్లకు కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 168 జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు రెండు జీబీ పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు ఉచితంగా పంపించుకోవచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు మూడు నెలల సభ్యత్వం కూడా లభిస్తుంది.  

ఎయిర్ టెల్ వినియోగదారులకు ఎంతో ఉపయోగంగా తీర్చిదిద్దిన మరో రీచార్జ్ ప్లాన్ ఇది. రూ.1.499 ఈ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటులో ఉంటుంది. అన్ని రోజులూ ఆన్ లిమిడెట్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అలాగే 252 జీబీ డేటా అందజేస్తారు. అంటే రోజూ 3 జీబీ డేటా లభిస్తుంది. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే వినియోగదారులు రోజూ వంద ఎస్ఎమ్ఎస్ లు పొందవచ్చు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే రూ.1.499 రీచార్జ్ ద్వారా పైఉపయోగాలతో పాటు అపరిమితంగా 5జీ డేటాను పొందే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అంది.✨

bottom of page