top of page

కొత్త ప్లాన్‌తో జియోకి ఎయిర్‌టెల్ సవాల్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే..

మన దేశంలోని టాప్ టెలికాం నెట్‌వర్క్‌లలో ఎయిర్‌టెల్ ఒకటి. అధిక స్పీడ్, అంతరాయాలు లేని నెట్‌వర్క్‌తో వినియోగదారులకు మంచి సేవలు అందిస్తోంది. ఇప్పుడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. రూ. 395తో 56 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్, రిలయన్స్ జియోతో పోటీ పడనుంది. ఇరుప్లాన్‌లను సమీక్షించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ రూ.395 ప్లాన్:

  • వ్యాలిడిటీ: 56 రోజులు

  • అపరిమిత వాయిస్ కాలింగ్

  • ఎస్ఎంఎస్: 600 ఎస్ఎంఎస్ (ఉచిత ఎస్ఎంఎస్‌లు ముగిసిన తర్వాత, స్థానిక ఎస్ఎంఎస్ రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్ రూ.1.5)

  • డేటా: 6జీబీ

  • అదనపు ప్రయోజనాలు:

  • అపోలో 24|7 సర్కిల్

  • వింక్ మ్యూజిక్

  • ఉచిత హెలోట్యూన్స్

ఎయిర్‌టెల్ వర్సెస్ జియో:

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీ ఇస్తుంటే, జియో మాత్రం 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. జియో రోజుకు 100 ఎస్ఎంఎస్ లను ఇస్తుండగా, ఎయిర్‌టెల్ మొత్తం 600 ఎస్ఎంఎస్ లను మాత్రమే అందిస్తోంది. దీని ద్వారా, జియో ప్లాన్ ఎక్కువ కాలం వ్యాలిడిటీ, ఎస్ఎంఎస్ లతో మెరుగైనదిగా కనిపిస్తోంది. అయినప్పటికీ, ఎయిర్‌టెల్ ప్లాన్ టెలికాం ల్యాండ్‌స్కేప్‌లో భవిష్యత్ టారిఫ్ సర్దుబాట్లను ప్రభావితం చేయడానికి వ్యూహాత్మక చర్య కావచ్చు.

bottom of page