top of page
Shiva YT

14 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. 🏢🔥

స్పెయిన్‌లోని వాలెన్సియాలో 14 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 🏢🔥 ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్టుగా తెలిసింది. ☠️ మరో 20 మంది గల్లంతయ్యారు.. 🚨 వారందరి పరిస్థితి ఎలా ఉందోనని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. 😢 నివేదికల ప్రకారం, గురువారం సాయంత్రం 5.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మంటలు చెలరేగాయి. ⌛ ఈ క్రమంలో దాదాపు 350 మంది భవనంలో చిక్కుకుపోయారు. 🏠 మంటల నుండి తప్పించుకోవడానికి చాలా మంది అనేక అంతస్తుల నుండి దూకారు. 🚒 ఈ క్రమంలో భవనం కింద నెట్‌లను ఏర్పాటు చేశారు. 🏗️ ప్రమాదం జరిగిన క్షణాల్లోనే టవర్ అంతటా మంటలు వ్యాపించినట్టుగా సమాచారం. 📡 ఆ బిల్డింగ్‌నుంచి మ‌రో బిల్డింగ్‌కు మంట‌లు వ్యాపించాయి. 🏢 ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 📹


వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి బహుళ అంతస్తుల నుండి కిందకు దూకడం కనిపించింది. 👨‍🚒 అతనిని రక్షించడానికి, కింత కొందరు మ్యాట్‌లు ఏర్పాటు చేశారు. 🔧 మరోవైపు భవనంలోని ఇళ్లలో ఉంటున్న చాలా మంది వ్యక్తులు తమ ఫ్లాట్ బాల్కనీ నుండి సహాయం కోసం అర్ధించటం కనిపించింది. 🆘 దాదాపు 20 మంది అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల్ని ఆర్పే ప్ర‌య‌త్నం చేశారు. 🚑 బ‌ల‌మైన గాలుల వ‌ల్ల మంట‌లు మరింత పెరుగుతున్నాయి.. 🌪️ క్రేన్ల ఆధారంగా ఫైర్‌ఫైట‌ర్లు స్థానికుల్ని ర‌క్షించారు. 🚒

ఈ ఘటనలో భవనం పూర్తిగా మంటల్లో దగ్థమైనట్టుగా తెలుస్తుంది. 🏢 మంట‌లు అంటుకున్న బిల్డింగ్‌లో 138 ఫ్లాట్లు ఉన్నాయి. 🏠 దాంట్లో 450 మంది ఇక్కడ నివసిస్తున్నారు. 👥 ప్రమాదంలో ఆరుగురు అగ్నిమాప‌క సిబ్బందితో పాటు మొత్తం 15 మంది గాయ‌ప‌డ్డారు. ☹️ అయితే వారి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. 🚨 గల్లంతైన 20 మంది కోసం గాలిస్తున్నామని వాలెన్సియా మేయ‌ర్ మారియా జోస్ క‌ట‌లా తెలిపారు. 📢


Comments


bottom of page