top of page
Suresh D

పవన్ కల్యాణ్‌కు భారీ షాక్


ఈ నెల 30వ తేదీన పిఠాపురానికి వెళ్లనున్నారు పవన్ కల్యాణ్. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసుకుంటోన్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు బత్తిన రాము పార్టీకి గుడ్‌బై చెప్పారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్నారు. ఆయన వెంట విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని, విజయవాడ తూర్పు, సెంట్రల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ప్రస్తుతం బత్తిన రాము విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జీగా వ్యవహరిస్తోన్నారు. 2019 నాటి ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నుంచి పోటీ చేశారు గానీ ఓడిపోయారు. మూడో స్థానంలో నిలిచారు. 30 వేలకు పైగా ఓట్లను సాధించారాయన అప్పట్లో. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి బత్తిన రాముకు టికెట్ దక్కలేదు. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇష్టం లేకపోవడంతో గుడ్ బై చెప్పారు.

Related Posts

See All

తొలిసారి మిస్‌ యూనివర్స్‌ పోటీలో సౌదీ అరేబియా బ్యూటీ.. 💃

ఇస్లామిక్‌ దేశాలలో సౌదీ అరేబియా అత్యంత సంపన్న దేశం. ఈ దేశం నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా అందాల పోటీల్లో పాల్గొన్న దాఖలాలు లేవు.

bottom of page