పోకిరి వచ్చి 17 ఏళ్లైంది.. ఆ తర్వాత 15 సినిమాలు చేసారు మహేష్. ఈ జర్నీలో ప్రిన్స్ కాస్తా సూపర్ స్టార్ అయ్యారు.. 40 కోట్ల మార్కెట్ 100 కోట్లైంది. అన్నీ బానే ఉన్నాయిగా.. ఇంకేంటి సమస్య అనుకోవచ్చు..! ఏదో ఓ ట్విస్ట్ లేకుండా స్టోరీ ఉండదుగా..! 🎭
ఎన్ని హిట్లు కొట్టినా.. ఎంత క్రేజ్ పెరిగినా..17 ఏళ్లుగా మహేష్ ఫ్యాన్స్‌కు ఓ కోరిక అలాగే ఉండిపోయింది. మరి దాన్ని త్రివిక్రమ్ అయినా తీరుస్తారా..? ఎంతైనా ఆ రోజులే వేరు.. కావాలంటే చూడండి ఎంత రఫ్‌గా ఉన్నాడో మా మహేష్..! 🌟

పోకిరి తర్వాత ఎన్ని హిట్స్ వచ్చినా.. మహేష్‌ను ఊర మాస్‌గా చూపించిన దర్శకుడే లేడు. ఎవరి వరకో ఎందుకు.. బిజినెస్ మ్యాన్‌తో పూరీ కూడా పోకిరి మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయారు. 🎩
దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఇలా చాలా హిట్లు వచ్చినా.. వింటేజ్ మహేష్ మాత్రం మిస్ అయిపోయారు. ఒక్కడు, అతడు, పోకిరిలో కనిపించిన మహేష్ మాకు కావాలంటున్నారు ఫ్యాన్స్. ఇన్నేళ్లకు త్రివిక్రమ్ ఇది అర్థం చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. 🌟
గుంటూరు కారం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ పోస్టర్‌లోనూ బీడీ తాగుతూనే కనిపించారు మహేష్. తాజాగా దమ్ మసాలా సాంగ్‌లోనూ ఔట్ అండ్ ఔట్ మాస్‌గానే కనిపించారు సూపర్ స్టార్. మొత్తానికి వింటేజ్ మహేష్ సంక్రాంతికి దర్శనమివ్వబోతున్నారు. 🌅