top of page
MediaFx

అధునాతన ఏఐ హెడ్‌ఫోన్‌లు: వినే విధానంలో విప్లవాత్మక మార్పు 🎧

హెడ్ ఫోన్ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరి దగ్గర ఇవి దర్శనమిస్తుంటాయి. ఒకప్పుడు కేబుల్‌తో కూడిన హెడ్ ఫోన్లో చూశాం.. కానీ ఇప్పుడు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అందుబాటులోకి రావడంతో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితులను నెలకొన్నాయి. మామూలుగా హెడ్ ఫోన్లు లౌడ్ స్పీకర్ కి భిన్నంగా ఒక వ్యక్తి ప్రైవేట్ గా వినడానికి లేదా మాట్లాడడానికి ఉపయోగపడతాయి. వాటితో పాటు ఆడియో యాంప్లీఫైయర్, రేడియో, సిడి ప్లేయర్, పోర్టబుల్ మీడియా ప్లేయర్, మొబైల్ ఫోన్, వీడియో గేమ్, లేదా ఎలక్ట్రానిక్ మ్యూజికల్ ఇంస్ట్రుమెంట్ వంటి సిగ్నల్ సోర్స్ కి కనెక్ట్ అవుతాయి.

ఈమధ్య బ్లూటూత్ కూడా అందుబాటులోకి రావడంతో వైర్‌లెస్ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ గుంపులో ఎంతమంది ఉన్నా పర్టిక్యులర్‌గా మనం వినాలనుకునే సౌండ్‌ను వినడానికి ఇప్పటివరకు అవకాశం లేదు. కానీ ఇప్పుడు అది సాధ్యమే అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు. మనం ఏం వినాలనుకొంటున్నామో.. అదే వినేలా సాయపడే అధునాతన ఏఐ హెడ్‌ ఫోన్‌‌ను ఆవిష్కరించారు.

పబ్లిక్ గాథరింగ్ ఎక్కువగా ఉండే కార్యక్రమాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో స్పష్టంగా వినిపించదు. అయితే వందల మంది ఒకేసారి మాట్లాడుతున్నప్పటికీ మనం ఏం వినాలి అనుకుంటున్నామో అది వినేలా సాయపడే అధునాతన ఏఐ హెడ్ ఫోన్ ను యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ హెడ్ ఫోన్ ను ధరించి మనం ఎవరి మాటలను అయితే వినాలనుకుంటున్నామో ఆ వ్యక్తి వైపునకు చూస్తూ అతను మాట్లాడేటప్పుడు హెడ్ ఫోన్ మీద ఉన్న బటన్ నొక్కాలని పరిశోధకులు తెలిపారు.

ఆ వ్యక్తి స్వర పేటిక శబ్దాలు పవనపుణ్యాన్ని కంప్యూటర్‌లోని మిషన్ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్ విశ్లేషించి ఆ వాయిస్‌ను మాత్రమే హెడ్‌ఫోన్‌కు సిగ్నల్స్ పంపిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. దీని ద్వారా మిగతా వాయిస్‌లు, సౌండ్స్ ఏమి వినపడని వారు తెలిపారు. తింటూ మనం ఏం వినాలి అనుకుంటామో అదే వినగలుగుతామని, ఇది ఇప్పటివరకు సాధ్యం కానప్పటికీ ఈ కొత్త టెక్నాలజీతో సాధ్యం అవుతుందని పరిశోధకులు తెలిపారు.

bottom of page