🎬🇮🇳 పాన్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. బాహుబలి, RRR చిత్రాలతో తెలుగు స్థాయిని ప్రపంచానికి చాటారు. ఏకంగా ఆస్కార్ అవార్డ్‌ను సాధించి ఇండియన్ సినిమా సత్తా ఏంటో తెలియచెప్పారు.
సినిమాల పరంగా రాజమౌళి అంటే చాలా మందికి అవగాహన ఉండొచ్చు. అయితే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పెద్దగా బయటకు తెలియనివ్వరు. దర్శకధీరుడు ఖాళీ సమయాల్లో పెద్ద స్టార్ హోటల్స్‌లో డిస్కషన్స్ చేయటం కంటే ఇంటి దగ్గర, ప్రకృతి వాతావరణంలోనే గడపటానికి ఇష్టపడుతుంటారు.💖 🤔 చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే.. నల్గొండకు దగ్గరగా ఉండే కట్టంగూర్ దగ్గర ఈయనకు పెద్ద ఫామ్ హౌస్ ఉంది. సినిమా షూటింగ్స్ నుంచి బ్రేక్ దొరికినప్పుడల్లా ఆయన కుటుంబంతో సహా అక్కడే సమయానికి గడుపుతుంటారు. తాజాగా రాజమౌళి తనలోని ప్రకృతి ప్రేమను మరోసారి బయట పెట్టారు. వివరాల్లోకి వెళితే, శంషాబాద్ దగ్గర రోడ్డు ఎక్స్‌టెన్షన్‌ను చేసే క్రమంలో కొన్ని పెద్ద చెట్లను కొట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.👍రాజమౌళి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఓకే చెప్పేశారు. అందులో భాగంగా 20 చెట్లను ఆయన దత్తత తీసుకున్నారు. వాటిని వేళ్లతో సహా పెకలించి తన ఫామ్ హౌస్‌ను తరలించారు రాజమౌళి. ఇంతకు ముందు కూడా ఆయన మూడు మర్రి చెట్లను ఇలాగే దత్తత తీసుకున్నారు. రాజమౌళి చేసిన మంచి పనిని ప్రకృతి ప్రేమికులు అప్రిషియేట్ చేస్తున్నారు.👏