ప్రస్తుత రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ఊబకాయం సమస్య అందరినీ వేధిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు భోజనంలో ఏ రకమైన ఆహారం తినాలో నిర్ణయించుకోవడం చాలా సవాలుగా మారుతుంది. ఇక చికెన్ వంటివి తినేవారికి ఇంకా ఫాట్ ఆడ్ అవుతుంది . అలాంటివాళ్ళకోసం జీరో ఆయిల్ చికెన్ మసాలా ఆరోగ్యకరమైన భోజనమని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఆయిల్ లెస్ చికెన్ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం. 😋👨🍳
ముఖ్యంగా ఈ రెసిపీని తయారు చేసేటప్పుడు ఏదైనా కొవ్వు పదార్ధాలను తొలగించాలి. అయితే మీరు చికెన్‌ను వేయించడానికి బదులుగా కాల్చడం లేదా గ్రిల్ చేయడం కూడా ఎంచుకోవచ్చు. కాబట్టి ఇది చికెన్‌ను మరింత ఆరోగ్యకరమైనదిగా చేస్తుంది.
ఆయిల్ లెస్ చికెన్ మసాలా రెసిపీ తయారీ ఇలా
ఆయిల్ లెస్ చికెన్ మసాలా చేయాలంటే చికెన్‌ను బాగా నానబెట్టాలి. ముఖ్యంగా నిమ్మ రసం, ఉల్లిపాయలు, పెరుగు మిశ్రమంతో చికెన్‌ను బాగా మేరినేట్ చేయాలి.. ఈ ఆయిల్ లెస్ చికెన్‌ను తయారు చేయడానికి తాజా మసాలాలను ఉపయోగించాలి. వంట చేసేటప్పుడు చికెన్ ఉడకబెట్టడానికి తగినంత సమయం ఇవ్వాలి. ఈ వంటకం చేయడానికి మొదట చికెన్‌ను నిమ్మరసం, ఉల్లిపాయలతో మెరినేట్ చేయాలి. కనీసం ఒక గంట పాటు విశ్రాంతి నానబెట్టాలి. పూర్తయిన తర్వాత పెరుగులో కొన్ని మసాలాలు కలపి నానబెట్టిన చికెన్‌తో కలపాలి. ఇప్పుడు ఒక నాన్-స్టిక్ పాన్ తీసుకుని చికెన్ ముక్కలపై మందపాటి మసాలా పూత వచ్చే వరకు ఉడికించాలి. రుచి కోసం ఉప్పు, తాజా కొత్తిమీర ఆకులతో అలంకరించాలి. అంతే టేస్టీటేస్టీ ఆయిల్ లెస్ చికెన్ మసాలా రెడీ..