ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆదిపురుష్ గురించే చర్చ జరుగుతోంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడులవుతోందా అని ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రామాయణ ఇతి హాసాన్ని వెండి తెరపై చూడాలని ఆతృతతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో..
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆదిపురుష్ గురించే చర్చ జరుగుతోంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడులవుతోందా అని ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రామాయణ ఇతి హాసాన్ని వెండి తెరపై చూడాలని ఆతృతతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ అత్యంత అట్టహాసంగా ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకను నిర్వహిస్తోంది. తిరుపతిలో మంగళవారం సాయంత్రం ఈవెంట్ జరగనుంది. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. అదే.. ఆది పురుష్ సినిమా ప్రదర్శించే అన్ని థియేటర్లలో ఒక సీటును ఖాళీ ఉంచడం.
ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో టికెట్లన్నీ అమ్మినా.. ఒక్క సీటు మాత్రం ఖాళీగా ఉంటుంది. సీటు ఖాళీగా ఉంచడం వెనక అసలు కారణం ఏంటనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. రామాయాణ పారాయణం ఎక్కడ జరిగినా, శ్రీరామ కథను ఎక్కడ ప్రదర్శించినా ఒక ప్రత్యేక ఆసనాన్ని వేస్తారు. దీనికి కారణం రామాయణ పారాయణాన్ని వీక్షించేందుకు ఆ ప్రదేశానికి హనుమంతుడు వస్తాడని భక్తు విశ్వాసం. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ కూడా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటును వదిలేయాలని నిర్ణయం తీసుకుంది.