top of page

'ది కేరళ స్టోరీ'పై అదా శర్మ సంచలన కామెంట్స్..

హార్ట్ ఎటాక్ ఫేమ్ అదా శర్మ నటించిన లేటెస్ట్ మూవీ 'ది కేరళ స్టోరీ'. కశ్మీర్ ఫైల్స్ తర్వాత ఆ రేంజ్ లో దేశవ్యాప్తంగా ఈ చిత్రం గురించి చర్చ జరుగుతోంది. రాజకీయంగా కూడా ఈ మూవీ ప్రకంపనలు రేపుతోంది.

ఈ చిత్రాన్ని విపుల్ అమృతల్ షా నిర్మించగా, సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. కేరళ యువత ఉగ్రవాద ముసుగులో చిక్కుకుకుంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అలాంటి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కేరళపై ఉగ్రవాదం ప్రభావం ఎలా పడుతోంది అనే అంశాలని కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మే 5న అన్ని భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కి రెడీ అవుతోంది.


ది కేరళ స్టోరీ చిత్రం రిలీజ్ కి దగ్గరవుతున్న నేపథ్యంలో ఈ మూవీని విమర్శించే వారు, సపోర్ట్ చేసేవారు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వార్ కి తెరతీశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన అదా శర్మ ఎలా ఫీల్ అవుతోంది అనేది ఆసక్తిగా మారింది. ఏసియా నెట్ న్యూసబుల్ కి చెందిన రిచా బుర్రా.. అదా శర్మని ఇంటర్వ్యూ చేశారు. కేరళ స్టోరీ చిత్రంపై వస్తున్న విమర్శలపై ఈ ఇంటర్వ్యూలో స్పందించిన అదా అనేక ఆసక్తికర అంశాలు పంచుకుంది.

అందుకే ఈ కథకి ఒకే చెప్పా

ఈ చిత్రాన్ని ఎంచుకోవడంపై అదా మాట్లాడుతూ.. నేను ఏ కథని అయినా క్షుణ్ణంగా పరిశీలిస్తాను. ఇది చెప్పాల్సిన కథ అని ఫీల్ అయ్యా. అందుకే ఒకే చెప్పా. అదా శర్మ ఈ చిత్రం చేయడంతో ఆమె కుటుంబ సభ్యులు కూడా గర్వంగా ఫీల్ అయ్యారట. కథ వినగానే నాలో కదలిక వచ్చింది. నేను అమ్మాయిని కాబట్టి ఇతర మహిళల బాధని సులభంగా అర్థం చేసుకోగలను. నేను మా అమ్మకి చాలా దగ్గరగా ఉంటాను. ఒక అమ్మాయి తన తల్లికి కుటుంబానికి దూరంగా కనీసం ఫోన్ కాంటాక్ట్ కూడా లేని పరిస్థితుల్లో ఉన్న కథ ఇది. ప్రజలకు తెలియాల్సిన కథలో నేను నటించినందుకు మా కుటుంబ సభ్యులు గర్వంగా ఫీల్ అయ్యారు.


బాధితుల్ని కలిశా

ఈ చిత్ర కథ గురించి తెలుసుకునే ప్రాసెస్ లో నేను కొందరు భాదితులని కూడా కలిశాను. బలవంతంగా వారికీ డ్రగ్స్ ఎలా అలవాటు చేశారు.. ఎలా టార్చర్ చేసారు అనే వీడియోలు చూశాను. కేరళ అమ్మాలని బలవంతంగా వారి ఇళ్ల నుంచి తీసుకువెళ్లి బ్రతకడానికి కూడా కష్టమైన ప్రదేశాల్లో ఉంచిన సంఘటనలు ఉన్నాయి. షాలిని ఉన్నికృష్ణన్ పాత్రలో నా నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి అంటే ఆ క్రెడిట్ దర్శకుడు సుదీప్తో సర్ కే దక్కుతుంది. ఆయన షాలిని పాత్రలో నన్ను నమ్మారు. రియల్ ఇన్సిడెట్స్ ఆధారంగా చేసిన కథ కాబట్టి కొంత ఒత్తిడి ఉండేది కానీ సినిమా చూస్తున్నప్పుడు అందరూ కథలో ఇన్వాల్వ్ అవుతారు.

ప్రతి అమ్మాయి చూడాల్సిన చిత్రం

ప్రతి ఒక్క అమ్మాయి ఈ చిత్రం చూడాలి. ప్రేమ పేరుతో అమ్మాయిలో ఎలా ట్రాప్ చేయబడుతున్నారో తెలుసుకోవాలి. ఎవరైనా అమ్మాయి ఐఎస్ఐఎస్ లో జాయిన్ అయితే అది ఇతరులకు కేవలం ఒక నంబర్ గా తెలుస్తుంది. అదే ఆ మహిళ మన కుటుంబసభ్యురాలు అయితే.. ఆ బాధని ఊహించడం కూడా కష్టమే అంటూ అదా శర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page